నవతెలంగాణ – మల్హర్ రావు
అర్హులైన ప్రతి ఒక్కరు పేరు ముసాయిదా జాబితాలో ఉంచడం జరిగిందని మండల ఇంచార్జి ఎంపిడిఓ రామ్మూర్తి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈనెల 6న ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల ముసాయిదా ఓటర్ల జాబితా.. ముసాయిదా పోలింగ్ స్టేషన్ల జాబితా మండల పరిషత్ కార్యాలయంలో ప్రచురించబడినదని తెలిపారు. సోమవారం మండలంలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. సమావేశానికి హాజరైన రాజకీయ పక్ష ప్రతినిధులు ఓటరూ జాబితా విషయంలో ఎటువంటి అభ్యంతరములు వ్యక్తం చేయలేదన్నారు. ఇంకా ఏమైనా అభ్యంతరాలు ఉంటే లిఖితపూర్వకంగా రాసి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య,బిఆర్ఎస్ అధ్యక్షుడు కుంభం రాఘవరెడ్డి పాల్గొన్నారు.
అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉంచాం: ఎంపీడీఓ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES