కేరళం సీఎం లేఖపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రంలో 2014-2023 మధ్య పరిపాలనకు, తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి తెలిపారు. ఆకాలం బీఆర్ఎస్-బీజేపీ దుష్పరిపాలన అని తప్పించుకొనే ప్రయత్నం చేశారు. అదే సమయంలో కేరళంలో మాత్రం గత యూడీఎఫ్ ప్రభుత్వాల వల్లే అభివృద్ధి జరిగిందని పునరుద్ఘాటించారు. కేరళం ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి రాసిన ప్రత్యుత్తరంలో 2023-24 నిటిఆయోగ్ ఎస్డీజీ సూచికను ప్రస్తావించిన విషయం తెలిసిందే. దీనిపై మళ్లీ సీఎం రేవంత్‌రెడ్డి మరో లేఖ రాసారు. అనేక రాష్ట్రాల సీఎంలను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఈడీ, సీబీఐలతో వేధిస్తున్నదనీ, కానీ కేరళం సీఎం జోలికి వెళ్లట్లేదంటూ పినరయి విజయన్ ప్రభుత్వ నిజాయితీని శంకిస్తూ ఆ లేఖలో రాసుకొచ్చారు. కేరళంలో పంచాయతీరాజ్ వ్యవస్థ విజయానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కరుణాకరన్, ఉమెన్ చాందీల కృషే కారణమంటూ ఆ క్రెడిట్‌ను తమపార్టీ ఖాతాలో వేసుకొనే ప్రయత్నం చేశారు.
కేరళంలో ఉపాధి లేక యువత విదేశాలకు వెళ్తున్నారని విమర్శించిన ఆయన, విదేశీ మారకద్రవ్యం రూపంలో దేశానికి వస్తున్న సంపదను విస్మరించే ప్రయత్నం చేశారు. తెలంగాణలో మాదిరే అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ఉద్యోగ నియామకాలు, స్వీయ ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడం వంటివి కేరళంలో అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. అయితే సీఎం రేవంత్‌రెడ్డిది అబద్ధాలతో కూడిన వితండవాదం అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వీడియో సందేశం విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఆ లెక్కలతో మాకు సంబంధం లేదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



