Saturday, September 27, 2025
E-PAPER
Homeకరీంనగర్రైతుల సంక్షేమమే లక్ష్యంగా సేవలు అందించాం

రైతుల సంక్షేమమే లక్ష్యంగా సేవలు అందించాం

- Advertisement -

– పిఎసిఎస్ చైర్మన్ ఇనగంటి భాస్కర్ రావు 
నవతెలంగాణ – కమాన్ పూర్

రైతుల సంక్షేమమే లక్ష్యంగా సహకార సంఘ సేవలు అందించామని పిఎసిఎస్ చైర్మన్ ఇనగంటి భాస్కర్ రావు అన్నారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తమ హయాంలో ఏడు కోట్ల 85 లక్షలు పంట రుణాలు మంజూరు చేశామని ,ఐదు కోట్ల 90 లక్షలు దీర్ఘకాలిక రుణాల మంజూరు.. 1.56 క్వింటాళ్ల ధాన్యం కొనుగోళ్లు, సన్న వడ్లకు ఐదు కోట్ల 96 లక్షల బోనస్ లబ్ధి, 738 మంది రైతులకు నాలుగు కోట్ల 86 లక్షల రైతు రుణమాఫీ,ఈ ఖరీఫ్ సీజన్ లో ఎరువుల కొరత లేకుండా  ఇప్పటివరకు ఐదు వేల బస్తాలు రైతులకు అందించామని అన్నారు. సహకరించిన మంత్రి శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్,  ఇతర అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ చిందం తిరుపతి, సహకార సంఘ సీఈఓ తిమ్మరాజు సంతోష్ కుమార్, డైరెక్టర్ గుండేటి శ్రీ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -