టీజీపీఆర్‌బీ చైర్మెన్ శ్రీనివాస్‌రావు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
తెలంగాణ ఆర్టీసీలో ట్రాఫిక్ సూపర్‌వైజర్లు, మెకానికల్ సూపర్‌వైజర్ పోస్టులకు రాతపరీక్ష రాయనున్న అభ్యర్థులకు శుభవార్త. మార్చి 29న జరగనున్న ఈ రాత పరీక్షకు సంబంధించి పాత ప్రశ్నావళిని తమ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచామని తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు (టీజీపీఆర్‌బీ) చైర్మెన్ వి.వి శ్రీనివాస్‌రావు శుక్రవారం తెలిపారు. గతంలో నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన ఈ ప్రశ్నావళి ప్రస్తుతం పరీక్ష రాయబోతున్న అభ్యర్థులు సన్నద్ధం కావడానికి ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. తమ అధికారిక వెబ్‌సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.టీజీపీఆర్‌బీ.ఇన్‌లో ఈ ప్రశ్నావళిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని శ్రీనివాస్‌రావు తెలిపారు.
ఆర్టీసీ ఉద్యోగాల పాత ప్రశ్నావళిని వెబ్‌సైట్‌లో పెట్టాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



