– బుగ్గవాగు పూర్తయితే గ్రావిటీ ద్వారా చెరువులకు నీరు :మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
– మంచుకొండ ‘ఎత్తిపోతల’ ప్రారంభం
నవతెలంగాణ-ఖమ్మం కలెక్టరేట్/రఘునాథపాలెం
రాష్ట్ర రైతాంగానికి అండగా ఉంటూ కార్యక్రమా లు చేస్తున్నామని, మూడు సంవత్సరాల్లో ఆయిల్ పామ్ సాగులో తెలంగాణ అగ్రస్థానంలో నిలవాలని వ్యవసాయ, చేనేత, జౌళి, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వి.వెంకటా య పాలెంలో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ సబ్ స్టేషన్, మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని మంగళవారం మంత్రి ప్రారంభించి జాతికి అంకితం చేశారు. మంచుకొండలో ప్రాజెక్టు నీటి డెలివరీ సిస్టం వద్ద పూలతో కృష్ణా నీటికి ఘన స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో రైతుల నుద్దేశించి మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. గత ఏడాది ఇదే రోజు మంచుకొండ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసిన సమయం లో ఏడాదికి సాగు నీరు విడుదల చేస్తామని హామీ ఇచ్చామని గుర్తు చేశారు. బుగ్గవాగు ప్రాజెక్టు పనులు పూర్తి చేసుకుంటే ఎలాంటి లిఫ్ట్ లేకుండానే గ్రావిటీ ద్వారా చెరువులు నింపుతామన్నారు.
పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ మాట్లాడుతూ.. సంవత్సరం వ్యవధిలో ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేయడంలో ప్రతి ఒక్కరి పాత్ర చాలా కీలకమ న్నారు. సాగు నీరు రావడంతో ఇక్కడి రైతుల జీవన ప్రమాణాలు మెరుగవుతాయని చెప్పారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ మాట్లాడుతూ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని సాగునీరు అందించేందుకు మంచుకొండ ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేశారని తెలిపారు. అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రఘునాథపాలెం మండలంలో రైతులకు ఉన్న సాగునీటి కష్టాలను గుర్తించిన మంత్రి 33చెరువులను నింపుతూ 2,400 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించేలా రూ.66 కోట్లతో మంచుకొండ ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేశా రని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మెన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ హన్మంత రావు, ఇరిగేషన్ ఎస్‌ఈ ఎం.వెంకటేశ్వర్లు, ఎన్‌పిడిసి ఎల్ ఎస్‌ఈ శ్రీనివాసచారి,ఖమ్మం ఆర్డీఓ నరసింహా రావు, తహసీ ల్దార్ శ్వేత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఆయిల్‌పామ్ సాగులో అగ్రస్థానంలో నిలవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



