– వికారాబాద్‌లో ట్యూబర్ క్యూలోసిస్ కాన్ఫరెన్స్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
నవతెలంగాణ – వికారాబాద్
టీబీ నిర్మూలనలో వికారాబాద్ జిల్లాను ఆదర్శంగా నిలపాలని గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ సూచించారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అనంతగిరి హిల్స్ హరిత రిసార్ట్స్‌లో శనివారం ట్యూబర్ క్యూలోసిస్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ”తెలంగాణ ట్యూబర్ క్యూలోసిస్, చెస్ట్ డిసిసెస్ కాన్ఫరెన్స్-2025” నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. టీబీ నివారణకు అందరూ బాధ్యత తీసుకోవాలన్నారు. టీబీ రాకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. వ్యాధి తగ్గడానికి చాలా రకాల మందులు వచ్చాయన్నారు. సబ్ కా వికాస్- సబ్ కా ప్రయాస్, టీబీ నిర్మూలనలో అందరూ కష్టపడితేనే.. అందరూ ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. రాష్ట్రానికి, దేశానికి వికారాబాద్ జిల్లాను రోల్ మాడల్‌గా తీర్చి దిద్దాలన్నారు. టీబీ లక్షణాల గురించి విస్తృతంగా అవగాహన కల్పించాలని చెప్పారు. టీబీ నిర్మూలనా చర్యలు తీసుకోవడంతో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన డాక్టర్ మల్లికార్జున (మహబూబ్‌నగర్), డాక్టర్ రాజు (జోగులాంబ గద్వాల్), డాక్టర్ సుమలత (ఆదిలాబాద్), డాక్టర్ పుల్లారెడ్డికి ప్రశంసాపత్రాలు, గోల్డ్ మెడల్స్, మెమోంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సెక్రటరీ దాన కిషోర్, టీబీ అసోసియేషన్ చైర్మెన్ డాక్టర్ సుదీర్ ప్రసాద్, దీనదయాళ్ బాగ్, డాక్టర్ నరేందర్, బాలచందర్, డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు గవర్నర్‌కు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణరెడ్డి స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు.
టీబీ నిర్మూలనలో ఆదర్శంగా నిలవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES