Sunday, April 5, 2026
E-PAPER
Homeజాతీయంతప్పుడు ప్రచారాన్ని ఎదుర్కోవాలి

తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కోవాలి

- Advertisement -

కేరళం సీఎం పినరయి విజయన్‌
తిరువనంతపురం :
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జరుగుతున్న ఎల్‌డిఎఫ్‌పై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కోవాలని, సత్యాన్ని ప్రచారం చేయాలని శనివారం కేరళం ముఖ్యమంత్రి పినరయ్‌ విజయన్‌ మద్దతు దారులను కోరారు. ఎన్నికల సందర్భంగా ఓటర్లతో మమేకమ వ్వడంలో తనకు పరిమితులున్నాయని విజయన్‌ అన్నారు. కేరళం అభివృద్ధిలో ఓ పెద్ద ముందడుగు వేయగల దశకు చేరుకుందని ఆయన అన్నారు. పరిపాలనా పరిమితులు, నాయకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేకపోయినట్టు తెలిపారు. ఆయనకు బదులు తన మద్దతుదారులు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నందుకు వారిని ప్రశంసించారు. శనివారం కేరళం ముఖ్యమంత్రి పినరరు విజయన్‌ ధర్మదాం నియోజకవర్గంలోని కన్నూర్‌ పొదువాచేరిలో జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కేరళ అభివృద్ధిలో పెద్ద ముందడుగు వేయగల దశకు చేరుకుంది. ప్రతి రాష్ట్రం సాధారణ అభివృద్ధితోపాటు ముందుకు సాగగలగాలి. అభ్యర్థిగా నాకు కొన్ని పరిమితులు ఎదురయ్యాయి. నేను ఎక్కువమంది ఓటర్లతో సంభాషించలేక పోయాను. నేను ఇతర నియోజకవర్గాలకు కూడా వెళ్లి ఉండాల్సింది. కానీ ప్రచారంలో పాల్గొనలేకపోయాను. ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకున్నారు. దానిని మీరు ఒక పరిమితిగా భావించకుండా ఆ బాధ్యతను స్వీకరించి ప్రచారం చేశారు. ఈ సమయంలో తప్పుడు ప్రచారం వ్యాప్తి చెందుతుంది. ప్రజలకు అసలు నిజాలు తెలియజేయడంపైనే దృష్టి పెట్టాలి’ అని విజయన్‌ కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -