Thursday, February 5, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రజల పక్షాన నిలబడి పోరాడే అభ్యర్థులను గెలిపించాలి

ప్రజల పక్షాన నిలబడి పోరాడే అభ్యర్థులను గెలిపించాలి

- Advertisement -

మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి

నవతెలంగాణ- మిర్యాలగూడ రూరల్‌
నిత్యం ప్రజల పక్షాన పోరాడే అభ్యర్థులను మున్సిపల్‌ ఎన్నికలలో గెలిపించాలని సీపీఐ(ఎం) మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కోరారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని 17వ వార్డు సీపీఐ(ఎం) అభ్యర్థ్ధి మల్లు మధులత, 41వ వార్డు అభ్యర్థి అస్రా మహామ్మద్‌ గెలుపు కోరుతూ బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడి పోరాడే అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు.

వార్డులో సమస్యల పరిష్కారం మిత్రపక్షాల అభ్యర్థులతోనే సాధ్యమని చెప్పారు. బీఆర్‌ఎస్‌ యువ నేత సిద్ధార్థ మాట్లాడుతూ.. గతంలో చేసిన అభివృద్ధి పనులను గుర్తు చేస్తూ రాబోయే రోజుల్లో వార్డులను అన్ని రంగాల్లోనూ ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దుర్గంపూడి నారాయణ రెడ్డి, ఘంటా శ్రవణ్‌ రెడ్డి, వాసు, అంజయ్య గౌడ్‌, వంశీరెడ్డి, సక్రామ్‌ నాయక్‌, లింగారెడ్డి, నేరెళ్ల శివ, అరవింద్‌, నాజర్‌ అలీ, చంటి, క్రాంతి, నేరెళ్ళ యాదమ్మ, శివ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -