లేదంటే పింఛన్ వచ్చేంతవరకు పెద్ద ఎత్తున ఐద్వా ఆధ్వర్యంలో ఆందోళన
నవతెలంగాణ – కంఠేశ్వర్
లింగీతాండ గ్రామస్తులకు పింఛన్ వచ్చే విధంగా చూడాలి అని, లేదంటే పింఛన్ వచ్చేంతవరకు పెద్ద ఎత్తున ఐద్వా ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని ఐద్వ జిల్లా కార్యదర్శి సుజాత తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత మాట్లాడుతూ..లింగి తాండ గ్రామంలో దాదాపు 40 మంది వితంతు మహిళలు ఉన్నప్పటికీ గత నాలుగు సంవత్సరాలుగా వారికి వితంతు పింఛన్లు రావడం లేదు. కాబట్టి అర్హులైన వితంతు మహిళల అందరికీ కూడా లింగీతాండ గ్రామస్తులకు పింఛన్ వచ్చే విధంగా చూడాలి లేదంటే పింఛన్ వచ్చేంతవరకు పెద్ద ఎత్తున ఐద్వా ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా కమిటీ సభ్యురాలు కళ, నగర కమిటీ సభ్యురాలు కే శ్రీదేవి, లింగి తాండ గ్రామస్తులు అనూష, లక్ష్మి, సాయవ్వ, బి లక్ష్మి, పాప అవ్వ, బుధవ్వ, తదితరులు పాల్గొన్నారు.
లింగీతాండ గ్రామస్తులకు పింఛన్ వచ్చే విధంగా చూడాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES