– ఊరుకొండలో సోషల్ ఆడిట్ ప్రజా వేదిక..
– అదనపు డిఆర్ డిఓ రాజేశ్వరి..
నవతెలంగాణ – ఊరుకొండ
ఊరుకొండ మండల కేంద్రంతోపాటు మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని అదనపు డిఆర్ డిఓ రాజేశ్వరి అన్నారు. సోమవారం ఊరుకొండ మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో ఎంపీడీవో కృష్ణయ్య అధ్యక్షతన నిర్వహించిన 2024-25 సంవత్సరపు సోషల్ ఆడిట్ ప్రజా వేదిక కార్యక్రమంలో అదనపు డిఆర్ డిఓ రాజేశ్వరి ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించి మాట్లాడారు.
ఫిబ్రవరి 2 నుండి ఫిబ్రవరి 20వరకు గ్రామాల్లో త్రాగునీటి సరఫరాపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నందున అందరు పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్ ల సమన్వయంతో త్రాగునీటి వనరులను గుర్తించడం, సమస్యలు ఉంటే పరిష్కార మార్గాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్ఆర్పి స్వామి, కృష్ణారావు, అంబుడ్స్మెన్ జంగయ్య, ఏపీడి చంద్రశేఖర్, ఏపీవో నర్సింహా, పంచాయతీరాజ్ ఏఈ మహేందర్, ఆడిట్ టీం, పంచాయతీ కార్యదర్శులు, ఈ.సి.లు, టి.ఏ.లు, ఎఫ్.ఏ. లు తదితరులు పాల్గొన్నారు.



