Wednesday, October 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు పోరాడాలి

42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుకు పోరాడాలి

- Advertisement -

సిపిఐ పట్టణ కార్యదర్శి జే రమేష్ 
నవతెలంగాణ – వనపర్తి 

రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు మనకు బీసీ సంఘాలు మద్దతుదారులు పోరాడాలని సిపిఐ పట్టణ కార్యదర్శి జే రమేష్ కోరారు. వనపర్తి సిపిఐ ఆఫీసులో పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జనాభాను లెక్కించి దాని ప్రకారమే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ జీవో తెచ్చారని దాన్ని కొట్టివేయటం బాధాకరమన్నారు. సిపిఐ బీసీలకు 42 శాతం రిజర్వేషన్కు మద్దతు ఇస్తూ కోర్టు కేసులో ఇంప్లీడ్ అయిందని బిజెపి, టిఆర్ఎస్ ఎందుకు ఇంప్లీడ్ కాలేదని ప్రశ్నించారు. బిజెపి అసెంబ్లీ చేసిన 42 శాతం రిజర్వేషన్ బిల్లును ఆమోదించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు.

టిఆర్ఎస్ కూడా బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పనిచేస్తుందన్నారు. బిజెపి బీఆర్ఎస్ పెదవులపై బీసీ రిజర్వేషన్లకు మద్దతు తెలుపుతూ లోపల అమలు కాకుండా కుట్రలు చేస్తున్నాయన్నారు. రేపు బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్రవ్యాప్తంగా 42 శాతం రిజర్వేషన్లకు మద్దతుగా కోర్ట్ స్టేట్ వ్యతిరేకంగా జిల్లా మండల కేంద్రాల్లో ఆందోళనలు చేపడుతుందన్నారు. వనపర్తి లో జరిగే ఆందోళనకు సిపిఐ మద్దతు ఇచ్చి పాల్గొంటుందన్నారు. పార్టీలకతీతంగా జిల్లాలో బీసీ సంఘాలు మద్దతుదారులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. పట్టణ నేతలు చిన్న కుర్మయ్య జయమ్మ వంశీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -