Monday, January 12, 2026
E-PAPER
Homeఆదిలాబాద్నేతకాని హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలి

నేతకాని హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలి

- Advertisement -

నేతకాని మహార్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సాయిని ప్రసాద్ నేత
నవతెలంగాణ- జన్నారం

నేతకాని కులస్తుల హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాటం చేయాలని నేతకాని మహర్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సాయిని ప్రసాద్ నేత అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో నేతకాని కులస్తులతో కలిసి  నిర్వహించిన పత్రిక విలేకరులతో మాట్లాడారు. నేతకానియులు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదగాలంటే ఐక్యంగా ఉండాలన్నారు.

నేతకాని సమాజం చైతన్యవంతం కావాలని విద్యాభివృద్ధిలో అద్భుత ఫలితాలు సాధించే దిశగా ముందుకు సాగాలని నేటి విద్యార్థి లోకానికి పిలుపునిచ్చారు. కేవలం మనం సంపాదించుకున్న విజ్ఞానం మాత్రమే మనలను సమాజంలో గౌరవప్రదమైన స్థానం కల్పిస్తుందని గుర్తుచేశారు. సభ్య సమాజ అభ్యున్నతికి కృషిచేయాలని మహనీయుల ఆశయ సాధనకు మనమంతా ఐక్యతగా ముందుకు సాగాల్సిన అవశ్యకతను గుర్తుచేశారు. ముందుగా నేతకాని సంఘం క్యాలెండర్ను ఆవిష్కరించారు.

క్యాలెండరును ప్రతిఒక్కరినీ అందజేసి ఈ 2026 సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ విజయంలో ముందుకు సాగాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బోర్లకుంట ప్రభుదాస్, మండల మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షులు, కుల సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జాడి గంగాధర్, విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి దుర్గం వినోద్ మండల అద్యక్షులు రత్నం లక్ష్మణ్ వర్కింగ్ ప్రెసిడెంట్ జాడి వెంకట్ సీనియర్ నాయకులు జాడి శంకర్, జూనుగురు మల్లయ్య బండారి స్వామి రత్నం మాణిక్యం లక్ష్మణ రాజన్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -