కొడంగల్‌లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ సదస్సు
నవతెలంగాణ-కొడంగల్
మహిళల హక్కులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా.. వారి రక్షణకు సంఘటితమై పోరా టాలకు సిద్ధం కావాలని వ్యవసాయ కార్మికసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్‌రాములు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పద్మశ్రీ పిలుపుని చ్చారు. శనివారం వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో సీఐటీయూ, వ్యకాస, ఎస్‌ఎఫ్‌ఐ, ఐద్వా, డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. స్థానిక మార్కెట్ యార్డులో అంగన్‌వాడీ సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు వెంకటమ్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి వెంకట్‌రాములు, పద్మశ్రీ హాజరయ్యారు. ముందు గా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ సమాజంలో మహిళలు అన్నిరంగాల్లోనూ అభివృద్ధి చెందుతున్నప్పటికీ.. అదే స్థాయిలో వారిపై అణచివేత, హింస, వివక్ష పెరుగుతుండడం ఆందోళనకరమన్నారు. మహిళలపై జరిగే నేరాలలో ఎక్కువ శాతం మద్యం, గంజాయి వంటి మాదక ద్రవ్యాల మత్తులోనే జరుగుతున్నాయన్నారు. గతంలో కార్మికులు ఎన్నో పోరాటాలు చేసి ఎనిమిది గంటల పని విధానాన్ని సాధించుకున్నారని, నేటి పాలకులు పని గంటలు పెంచుతూ కార్మిక హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం మతోన్మాద విధానాలను వేగవంతం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటయ్య, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు రామకృష్ణ, జిల్లా కోశాధికారి బుస్స చంద్రయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బుగ్గప్ప, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి మల్కయ్య, డీవైఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి సతీష్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు రాజు, జిల్లా కార్యదర్శి అక్బర్, జిల్లా ఉపాధ్యక్షులు అనిల్, అంగన్‌వాడీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సమ్మ, కొండగల్ కార్యదర్శి సంతోష, ఆశావర్కర్స్ సంఘం జిల్లా కార్యదర్శి మంగమ్మ, టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.
మహిళల హక్కుల రక్షణకు ఐక్యంగా పోరాడాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



