Thursday, September 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కుల వృత్తులకు జీవం పోయాలి 

కుల వృత్తులకు జీవం పోయాలి 

- Advertisement -

– ఆదరణ లేక  కనుమరుగవుతున్న కుల వృత్తులు
– బీసీ సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు, అధ్యక్షులు
నవతెలంగాణ –  కామారెడ్డి 

రోజురోజుకు దేశంలో కులవృత్తులు కనుమరు అవుతున్నాయని ఆ కులవృత్తులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీవం పోయాలని బిసి సంక్షేమ సంఘం కామారెడ్డి జిల్లా గౌరవ అధక్షులు పుట్ట మల్లికార్జున్, అధ్యక్షులు సాప శివరాములు అన్నారు. తేదీ 18 సెప్టెంబర్ 2025 గురువారం ప్రపంచ వెదురు దినోత్సవాన్ని పురస్కరించుకొని కామారెడ్డి  మేదరి   జిల్లా (మహేంద్ర) మేదరి సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ వెదురు దినోత్సవం కార్యక్రమం కామారెడ్డి పట్టణంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన పుట్ట మల్లికార్జున్, సాంబశివరావు లు మాట్లాడుతూ  కులవృత్తులు, చేతివృత్తులకు ఆదరణ లేక వారు రోడ్డున పడుతున్నరాని అలాంటి  కులవృత్తుల వారిని కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకునా  దాఖలు లేవన్నారు. గత కొన్ని సంవత్సరాల క్రితం చిలుకల పంచాంగం చెప్పేవారు, పాముల ఆటలు ఆడించేవారు, మాలసింది వారు ఆటలాడేవారు, పద్మశాలిలకు సంబంధించిన సాధన సూరులు గ్రామాలకు వచ్చి ఇంద్ర మహేంద్రజాల ఆటలు ఆడేవారు. ఇలా అనేకమైన కుల కురువృత్తులు అడుగంటిపోయాయన్నారు.

ఈ కుల వృత్తుల గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి కుల వృత్తులను ఆదరించవలసిందిగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా తరపున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నామన్నారు.  ఈ  కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు  డాక్టర్  పుట్ట మల్లికార్జున్, కామారెడ్డి జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సాప శివరాంలు నేత, కామారెడ్డి జిల్లా మేదరి సంఘం అధ్యక్షులు ఆర్నె కిషన్,  బాల్ రాజ్ , జిల్లా ప్రధాన కార్యదర్శి మర్రి గంగాధర్, జిల్లా కోశాధికారి  ఇందూరి సంజీవులు, జిల్లా ప్రచార కార్యదర్శి  ఉరె లక్ష్మీ, జిల్లా మహిళా అధ్యక్షురాలు, జిల్లా కార్యవర్గ సభ్యులు  రాజేందర్, బలరాం, మహిళా సభ్యురాలు  శారద, ఉమా, పోచవ్వ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -