శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ శ్రీను బాబు
నవతెలంగాణ – మల్హర్ రావు (కాటారం)
ఆధునిక సమాజంలో చిరుతల రామాయణం లాంటి ప్రాచీన కళలు ప్రజలకు, నేటి యువతకు అందించడం, కళాకారులకు తమ ప్రోత్సాహం ఉంటుందని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు సోదరుడు, శ్రీపాద ట్రస్ట్ చైర్మెన్ దుద్దిల్ల శ్రీను బాబు అన్నారు. గారెపల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి చిరుతల రామాయణం శ్రీరామ పట్టాభిషేకం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యువకులు రామాయణంలో పాత్రలు ధరించి ఆదర్శంగా నిలువడం పట్ల అభినందించారు. రెండు నెలలగా సుమారు 30 మంది కళాకారులు చిరుతల రామాయణం ప్రదర్శన నిర్వహిం చేందుకు నేర్చుకున్నారు.రామాయణం పాత్రల కు కోచింగ్ ఇచ్చిన గురువు కొత్తపెళ్ళి రాజయ్య ను అభినందించి శాలువా తో సన్మానం చేశారు. చిరుతల రామాయణం పాత్రదారులను, సహకరించిన దాతలను శాలువాతో చిరుతల రామాయణం కమిటీ ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి మండలం లోని వివిధ గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
నేటి తరానికి ప్రాచీన కలలను అందించాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES