Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుVeeranari Ailamma: వీరనారి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో ఉద్యమాలకు సిద్ధం కావాలి...

Veeranari Ailamma: వీరనారి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో ఉద్యమాలకు సిద్ధం కావాలి…

- Advertisement -

నవతెలంగాణ మునుగోడు:

వీరనారి ఐలమ్మ పోరాటస్పూర్తితో ఉద్యమాలకు సిద్ధం కావాలని సీపీఐ(ఎం) మునుగోడు మండల కార్యదర్శి సాగర్ల మల్లేష్ అన్నారు. బుధవారం మునుగోడు మండల సీపీఐ(ఎం) కార్యాలయంలో వీరనారి ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన మహత్తర వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ముందుండి దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వీరనారి ఐలమ్మ ఆమె స్ఫూర్తితో ఈనాటి యువత ముందుండాలని అన్నారు. జమీందారు వ్యవస్థలో గ్రామాల్లో రైతులు ఎన్నో బాధలు అనుభవించేవారు ఐలమ్మ ఈ పరిస్థితిని ఎదుర్కొని రైతుల పక్షాన నిలిచారు, ఆమె తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో భాగమై భూస్వాముల అక్రమ హక్కులను వ్యతిరేకించారు.

భూమిపై హక్కుల కోసం సామాజిక న్యాయం కోసం సమానత్వం కోసం పోరాడిన తొలి మహిళ…ఉద్యమ నేతలతో ఆమె ఒకరు తెలంగాణ ప్రాంతంలో నిజాం పాలనలో జరుగుతున్న దోపిడి పీడనా వ్యట్టిచాకిరి త్వరలో జమీందారులు జారీర్దారుల వ్యతిరేకంగా జరిగిన గొప్ప పోరాటంలో కమ్యూనిస్టు యువధాన యోధులు అనేక త్యాగాలు చేసి ప్రజలకు అండగా నిలిచారు ఈ పోరాటంలో 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచారని మూడు వేల గ్రామ రాజ్యాలు ఏర్పడ్డాయని వెట్టి చాకిరి రద్దు చేయబడింది జమీందారులను గ్రామాల నుండి తరిమికొట్టారు.

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఎందరో ముస్లింలు నాయకులు మఖ్దూం, షోయాబుల్లా ఖాన్, షేక్ బందగి తదితరులు భూస్వామ్య వ్యతిరేకంగా విరోచితంగా పోరాడారు. ఈ రాష్ట్రంలో సాయిధ పోరాటాలకు నిజమైన వారసులు కమ్యూనిస్టులే అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు వరికుప్పల ముత్యాలు, డివైఎఫ్ఐ మండల కార్యదర్శి నరేష్, యాట వంశీ, సైదులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad