– వంగూరి రాములు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
కార్మికులు పోరాడి సాధించుకున్న భవన నిర్మాణ సంక్షేమ బోర్డు రక్షణకై ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ (సిఐటియు) రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వంగూరి రాములు పిలుపునిచ్చారు. గురువారం తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ నలగొండ పట్టణ మహాసభ సలివోజు సైదాచారి పాక లింగయ్య ల అధ్యక్షతన దొడ్డి కొమరయ్య భవన్లో జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల విధానాలను అవలంబిస్తూ కార్మికులు పోరాడి సాధించుకున్న అనేక చట్టాలను మార్పు చేసి నాలుగు కోడ్ లుగా విభజించి కార్మికులను కట్టు బానిసలుగా చేస్తుందని ఆరోపించారు. 1996 కేంద్ర నిర్మాణరంగ సంక్షేమ చట్టం ఆధారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2009 భవన మరియు ఇతర నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పడిందని దాని ద్వారా 9 రకాల సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయని అన్నారు. ప్రమాదవశాత్తు మరణించిన సందర్భంలో ఇస్తున్న ఆరు లక్షల 30 వేల రూపాయలను 10 లక్షలకు పెంచాలని సాధారణ మరణానికి ఇస్తున్న లక్ష 30 వేలు ఐదు లక్షలకు పెంచాలని ప్రసూతి వివాహ కానుకలు 30 వేల నుండి లక్షకు పెంచాలని డిమాండ్ చేశారు. అడ్డా ప్రదేశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని అడ్డా మీదికి పనికొచ్చిన వారికి పేరు నమోదు చేసుకొని పనిలేని రోజుల్లో సంక్షేమ బోర్డు ద్వారా సగం కూలి చెల్లించే విధంగా తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. 50 సంవత్సరాలు నిండిన భవన నిర్మాణ కార్మికులకు నెలకు తొమ్మిది వేల రూపాయల కనీస పెన్షన్ ఇవ్వాలని గత ప్రభుత్వం ప్రకటించిన విధంగా నిర్మాణ కార్మికులకు బైకులు ఇవ్వాలని ఇండ్లు లేని కార్మికులకు ఇంటి నిర్మాణానికి 10 లక్షలు సంక్షేమ బోర్డు ద్వారా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య మాట్లాడుతూ నిర్మాణ రంగ కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాడేది ఒక సిఐటియు మాత్రమేనని అన్నారు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వ నుండి వచ్చే సంక్షేమ పథకంతో పాటు ఇంటి యజమానుల ద్వారా కూడా లక్షలాది రూపాయలు ఇప్పించి ఆ కుటుంబాలను ఆదుకోవడం జరుగుతుందని అన్నారు నిర్మాణరంగ కార్మికులు తమ రంగాలలో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సంఘటితంగా పోరాటమే తప్ప మరో మార్గం లేదని అన్నారు నల్గొండ పట్టణంలో సెప్టెంబర్ 20న జిల్లా మహాసభ సెప్టెంబర్ 24,25 భద్రాచలంలో రాష్ట్ర మహాసభలు నిర్వహించి పోరాట కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని అన్నారు. మహాసభ ప్రారంభానికి ముందు యూనియన్ అధ్యక్షులు సలివొజు సైదాచారి జెండా ఆవిష్కరణ చేశారు.
నూతన కమిటీ ఎన్నిక..
పట్టణ నూతన కమిటీని 23 మందితో ఏకగ్రీవంగా ఎందుకున్నారు. అధ్యక్షులు సలివోజు సైదాచారి కార్యదర్శి అవుట రవీందర్ కోశాధికారి దేవురపల్లి వెంకట్ రెడ్డి ఉపాధ్యక్షులు పాక లింగయ్య కత్తుల జగన్ నోముల యాదయ్య సాగర్ల మల్లయ్య గడగోజు వెంకటాచారి సహాయ కార్యదర్శిలు భీమనపల్లి శంకర్ ,వల్లపు సైదరాజు, తవుడోజు నాగచారి @రాజు, బైరోజు ఆంజనేయులు కార్యవర్గ సభ్యుల గా ఉంగరాల సైదులు గుంజ లక్ష్మణ్ పిట్టల రమేష్ పోన్నేబోయిన లింగస్వామి, దుప్పలపల్లి శంకర్ కొండ నాగయ్య తదితరులను ను ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ ఐతరాజు రామచంద్రు ప్రభు చారి బ్రహ్మచారి దాసరి నాగరాజు నాంపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు