Wednesday, December 31, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుకార్పొరేషన్‌, మున్సిపల్‌ ఎన్నికల్లో సత్తా చాటాలి

కార్పొరేషన్‌, మున్సిపల్‌ ఎన్నికల్లో సత్తా చాటాలి

- Advertisement -

మతోన్మాద రాజకీయాలను తిప్పికొట్టాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
స్థానిక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన విజయాలతో ప్రజా పోరాటాలు రూపొందిస్తాం : సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
పాలేరు నియోజకవర్గంలో గెలుపొందిన సర్పంచులు, వార్డు మెంబర్లకు అభినందన
నవతెలంగాణ- తిరుమలాయపాలెం

దేశంలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ అవలంబిస్తున్న మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా సీపీఐ(ఎం) కార్యకర్తలు సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని, రాబోయే కార్పొరేషన్‌, మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీ సత్తా చాటాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామంలో మంగళవారం సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు షేక్‌ బషీరుద్దీన్‌ అధ్యక్షతన జరిగిన పార్టీ పాలేరు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం నియోజకవర్గంలో పార్టీ నుంచి గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు, పోటీ చేసిన అభ్యర్థులను జాన్‌వెస్లీ సన్మానించి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలపై ఆర్థిక భారాలు మోపుతోందని, మరోపక్క మతోన్మాద రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ఆర్థిక భారాలు మోయలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కానీ, బీజేపీ మతోన్మాద రాజకీయాలతో ప్రజాస మస్యల నుంచి దృష్టి మళ్లిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ను సైద్ధాంతికంగా ఎదుర్కో వడానికి, ప్రజా సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదని, హామీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని అన్నారు. త్వరలో జరుగనున్న కార్పొరేషన్‌, మున్సిపల్‌ ఎన్నికల్లో సత్తా చాటాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. స్థానిక ఎన్నికల్లో సీపీఐ(ఎం) బలపర్చిన అభ్యర్థులకు మద్దతుగా నిలిచి గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు.

సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. పాలేరు డివిజన్‌ వ్యాప్తంగా ఎనిమిది మంది సర్పంచులు, ఏడుగురు ఉప సర్పంచ్‌గా 100కు పైగా వార్డు స్థానాలు గెలుచుకున్నామని వివరించారు. ప్రలోభాలకు తలొగ్గకుండా పోరాడిన అభ్యర్థులకు, ఓట్లు వేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన నాయకులందరూ ఆ పదవిని ప్రజల కోసం ఉపయోగించాలని సూచిం చారు. మంచి పరిపాలనందించి సీపీఐ(ఎం) వారస త్వాన్ని, గతంలో ప్రజాప్రతినిధులుగా పనిచేసిన వారి వారసత్వాన్ని పెంచాలని చెప్పారు. ఈ స్ఫూర్తితో రానున్న ఎన్నికల్లో మరిన్ని స్థానాలను గెలుచుకునేందుకు కార్యకర్తలు, నాయకులు నిరంతరం కృషి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండి పద్మ, ఎర్ర శ్రీనివాసరావు, డివిజన్‌ కార్యదర్శి బండి రమేష్‌, నాయకులు కొమ్ము శ్రీను, నండ్ర ప్రసాద్‌, సుదర్శన్‌ రెడ్డి, గొడవర్తి నాగేశ్వరరావు, మల్లెల సనుమంతరావు, కె.వి.రెడ్డి, దాసరి మహేందర్‌, పుల్లూరి నాగేశ్వరరావు, పద్మ నాభుల సుధాకర్‌, బింగి రమేష్‌, వెంకన్న, తెగినాటి మంగ తాయారు, సుగుణమ్మ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -