Tuesday, October 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాబోయే ఎన్నికల్లో సత్తా చాటాలి 

రాబోయే ఎన్నికల్లో సత్తా చాటాలి 

- Advertisement -

బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఐలయ్య 
నవతెలంగాణ – పెద్దవంగర

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని ఆ పార్టీ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య పిలుపునిచ్చారు. కొరిపల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడు ఆరుట్ల వెంకట్ రెడ్డి అధ్యక్షతన గ్రామ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఐలయ్య మాట్లాడుతూ.. ఎన్నికల వాగ్దానాలను అమలుచేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందన్నారు. కాంగ్రెస్ బాకీ కార్డులను ప్రతి ఇంటికి పంపిణీ చేయాలన్నారు. ప్రభుత్వ మోసాలను, ఎగవేతలను ప్రజలకు వివరించాలని పేర్కొన్నారు. బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలన్నారు.‌ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీరాం సంజయ్, మండల నాయకులు కనుకుంట్ల వెంకన్న, సుధీర్, జ్ఞానేశ్వర చారి, శోభ ప్రసాద్, బీమా నాయక్, వెంకన్న, కృష్ణారెడ్డి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -