Saturday, January 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హేతుబద్దీకరణను విరమించుకోవాలి

హేతుబద్దీకరణను విరమించుకోవాలి

- Advertisement -

డెమొక్రటిక్ టీచర్స్ పెడరేషన్ డిమాండ్
నవతెలంగాణ – మల్హర్ రావు

త్వరలో చేపట్టబోయే హేతుబద్ధీకరణను విరమించుకోవాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ భూపాలపల్లి జిల్లా శాఖ శనివారం డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యారంగాన్ని అభివృద్ధి పరుస్తామని చెప్పుతూనే రైజింగ్-2047 కార్యక్రమం పేరుతో మళ్లీ ప్రభుత్వం నమ్మించే ప్రయత్నం చేస్తుందన్నారు. గతంలో విజన్ 2020 పేరుతో చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలే నేటికీ విద్యారంగాన్ని ధ్వంసం చేసి ప్రైవేట్ రంగాన్ని అభివృద్ధి చేశాయని, ప్రస్తుతం చేపట్టే రైజింగ్ 2047 లో భాగమే ఈ హేతుబద్ధీకరణని దుయ్యబట్టారు.

విద్యారంగానికి సరిపోయే బడ్జెట్ కేటాయించకుండా విద్యారంగాన్ని ఎలా అభివృద్ధి పరుస్తారని ప్రశ్నించారు.తరగతికి ఒక గదిని, పాఠశాల ఆవరణలో ఆహ్లదకర వాతావరణం నెలకొల్పకుండా, విద్యారంగంపై సరియైన పర్యవేక్షణ లేకుండా పాఠశాలలను అభివృద్ధి చేస్తామనడం దాటవేత ధోరణి ఆన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి విద్యారంగ నిపుణులతో ఉపాధ్యాయ సంఘాల బాధ్యులతో పాఠశాల పేరెంట్స్ కమిటీ ప్రతినిధులతో గపాల దశలవారీగా చర్చించి పబ్లిక్ విద్యారంగా అభివృద్ధికి తోడ్పడే విధానాలను రూపొందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అశోక్, ఏ తిరుపతి, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, దేవేంద్ర తిరుపతిరెడ్డి, కార్యదర్శిలు వీరేశం, బోజ్జా నాయక్, వీరన్న, ప్రభాకర్, రాష్ట్ర కౌన్సిలర్ టి. సుదర్శనం, ప్రభాకర్ రెడ్డి, రవీందర్రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -