– వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్
– నవతెలంగాణబ్యూరో రిపోర్టర్ ఎస్ వెంకన్నకు నవతెలంగాణ బృందం పరామర్శ
నవతెలంగాణ -కూసుమంచి
పేద కుటుంబంలో పుట్టి.. కమ్యూనిస్టు పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించి, తన ఇద్దరు కుమారులను సైతం ఎర్రజెండా పార్టీలోనే పనిచేసే విధంగా ప్రోత్సహించిన నర్సమ్మ గొప్ప కమ్యూనిస్టు అని, ఆమె ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ తెలిపారు. మంగళవారం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పోచారం గ్రామంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సాలే నర్సమ్మ సంస్కరణ సభ నిర్వహించారు. ముందుగా నర్సమ్మ చిత్రపటానికి పలువురు పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం పోచారం సీపీఐ(ఎం) గ్రామ కార్యదర్శి ఆర్.వెంకటయ్య అధ్యక్షతన జరిగిన సభలో వెంకట్ మాట్లాడారు. సామాన్యుల బతుకుల్లో మార్పులు రావాలని కోరుకుని ఎర్రజెండా కోసం నర్సమ్మ పనిచేసిందన్నారు. తన మొదటి కుమారుడు ఎస్వీ వెంకట్ (నవతెలంగాణ స్టేట్ బ్యూరో), కోడలు ఎస్.రమ (సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు), రెండో కుమారుడు తిరుపతయ్య కమ్యూనిస్టు పార్టీలో కొనసాగుతున్నారని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ సీనియర్ నాయకులు రాజారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, నవతెలంగాణ దినపత్రిక ఎడిటర్ రాంపల్లి రమేష్, స్టేట్ బ్యూరో పద్మరాజు, స్టేట్ మఫిషియల్ ఇన్‌చార్జి వేణుమాధవ్, టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవపున్నయ్య, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు మాధవరెడ్డి, మధు, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బండి రమేష్, సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కళ్యాణం వెంకటేశ్వరరావు, తూము విష్ణు, నాయకులు రమ్య, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి తోటకూరి రాజశేఖర్, జిల్లా కమిటీ సభ్యులు షేక్ బషీరుద్దీన్, సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు బిక్కసాని గంగాధర్, కర్ణబాబు, గ్రామశాఖ సభ్యులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, పార్టీ సానుభూతిపరులు, తదితరులు పాల్గొన్నారు.
సాలే నర్సమ్మ ఆశయ సాధన కోసం కృషి చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



