– రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం యాదగిరి.
నవతెలంగాణ -డిచ్ పల్లి
జాతీయ సమగ్రతకు పాటు పడుతూ పోటీ తత్వాన్ని పెంపొందించు కోవాలని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం యాదగిరి సూచించారు. సోమవారం తెలంగాణ యూనివర్సిటీలో ఎన్ ఎస్ ఎస్ ప్రీ రిపబ్లిక్ పరేడ్ ఎంపికలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యం.యాదగిరి ముఖ్య అతిథిగా హాజరై ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు సామాజ సేవా కార్యక్రమంలో విరివిగా పాల్గొనాలని సూచించారు. ప్రతి ఒక్క వాలంటీర్లు ప్రీ పరేడ్ ఎంపికకు పోటీ పడాలని పేర్కొన్నారు.గతంలో రెండు సార్లు తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులు గణతంత్ర వేడుకల్లో పాల్గొన్నారనీ ఈసారి కూడా మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించాలని సూచించారు.
వాలంటీర్లు పోటీ తత్వం అలవర్చుకోవడంతో మిగతా ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలకు ఎంపిక అయ్యే అవకాశం ఉందన్నారు. ఎవరు గెలిచినా అది తెలంగాణ వర్సిటీ విజయంగా భావించాలని సూచించారు. ఈ ఎంపిక కార్యక్రమనికి రాష్ట్ర ఎన్ఎస్ఎస్ యువజన అధికారి సైదా నాయక్ పర్యవేక్షించారు. విద్యార్థుల ఎత్తు, పరుగు పందెం, పరేడ్ మరియు కల్చరల్ కార్యక్రమాలు వ్యక్తిగత నైపుణ్యాన్ని పరీక్షించారు. ఈ కార్యక్రమాన్ని ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త ప్రొఫెసర్ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రోగ్రాం అధికారులు డాక్టర్ స్వప్న, డాక్టర్ స్రవంతి, డాక్టర్ సంపత్, డాక్టర్ హలీం ఖాన్, డాక్టర్ అంజయ్య, ప్రొఫెసర్ రాంబాబు పాల్గొన్నారు.