బీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ యాసం రమేష్
నవతెలంగాణ నెల్లికుదురు
మొంతా తుఫాన్ ప్రభావంతో కురిసిన అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బి ఆర్ ఎస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ యాసం రమేష్ అన్నారు. వర్షాలకు నష్టం జరిగిన పంటలను పరిశీలించే కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇట్టి వర్షాలకు మండల పరిధిలోని పత్తి వరి మొక్కజొన్న మిరప పంటలు వేసిన రైతులు తీవ్రంగా నష్ట పోయి పెట్టుబడులు కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదన్నారు కావున ప్రభుత్వం వెంటనే స్పందించి అధికారులతో క్షేత్ర స్థాయి పరిశీలన జరిపించి జరిగిన నష్టానికి తగిన పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు శివర్ల కొమురయ్య, ఆవుల సాయిమల్లు, భత్తిని నవీన్ రైతులు ఆకుల మల్లేష్, యాసం వెంకన్న,దాసరి కుమార్ తదితరులు పాల్గొన్నారు .



