జాన్‌వెస్లీని కలిసిన డెవలప్‌మెంట్
సొసైటీ ఫర్ ద డెఫ్ రాష్ట్ర కన్వీనర్
నవతెలంగాణ – ముషీరాబాద్
వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 21న చేపట్టనున్న ధర్నాకు మద్దతివ్వాలని కోరుతూ డెవలప్‌మెంట్ సొసైటీ ఫర్ ద డెఫ్ రాష్ట్ర కన్వీనర్, కో కన్వీనర్ వల్లభనేని ప్రసాద్, కాటమొని వెంకటేష్.. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీని కోరారు. బుధవారం హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పొందుపర్చిన ‘చేయూత’ పింఛన్లు వృద్ధులకు రూ.4000, వికలాంగులకు రూ.6000 ఇవ్వాలని డిమాండ్ చేశా రు. అలాగే, వికలాంగులకు రాష్ట్రవ్యాప్తంగా బస్సుల్లో ఉచిత ప్రయాణ అవకా శం కల్పించాలని కోరారు. జాబ్ క్యాలెండర్, ఉద్యోగ నోటిఫికేషన్లు విడు దల చేసి ఖాళీలను భర్తీ చేయాలని, ఆర్‌పీడబ్ల్యూడీ చట్టం-2016ను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించి అన్ని రంగాల్లో సమాన అవకాశాలు ఇవ్వాలన్నారు. 21న తలపెట్టిన ధర్నాకు పెద్దఎత్తున హాజరై జయప్రదం చేయాలని వికలాంగులకు పిలుపునిచ్చారు.
వికలాంగుల ధర్నాకు మద్దతివ్వాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



