- Advertisement -
ట్రంప్ హెచ్చరిక
ఇరాన్‌ను సంక్షోభం నుంచి బయటకు తెస్తాం
వాషింగ్టన్: ఇరాన్‌తో ఎలాంటి ఒప్పందం ఉండదని, బేషరతుగా లొంగిపోవాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఆ తర్వాత ఇరాన్‌కు ఆమోద యోగ్యమైన నాయకుడి ఎన్నిక ఉంటుందన్నారు. వివిధ భాగస్వామ్య పక్షాలతో కలిసి ఇరాన్‌ను సంక్షోభం నుంచి బయటకు తీసుకువచ్చేందుకు తాము కృషి చేస్తామన్నారు. గతంలో లేని విధంగా ఇరాన్‌ను ఆర్థికంగా మెరుగైన, బలమైన స్థితికి తీసుకు వస్తామన్నారు. ఇరాన్‌కు మంచి భవి ష్యత్తు ఉంటుందని పేర్కొంటూ ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ పోస్టు చేశారు.
- Advertisement -



