– క్రీడల పట్ల ప్రభుత్వం విజన్‌తో ముందుకెళ్లాలి : మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
క్రీడాకారులు అయితే ఉద్యోగాలు పక్కా అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడ్డం సంతోషకరమని మాజీమంత్రి పి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సీఎం వ్యాఖ్యలపై ఆమె సోమవారం ఎక్స్ ద్వారా ట్వీట్ చేశారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించిన ఒకరిద్దరికీ కాకుండా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో వివిధ క్రీడల్లో రాణిస్తున్న తెలంగాణ బిడ్డలందరికీ వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. మంచి క్రీడాకారులు కావాలంటే పాఠశాల స్థాయి నుండే శిక్షణ ఇవ్వాలని సూచించారు. శిక్షణ ఇవ్వటానికి పీఈటీలుండాలని తెలిపారు. మట్టిలో మాణిక్యాలను వెలికి తీయడానికి ప్రభుత్వం దూరదృష్టితోపాటు విజన్‌తో ముందుకెళ్లాలని కోరారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 1,804 పీఈటీ పోస్టులు ఖాళీగా ఉన్నా ఎందుకు భర్తీ చేయటం లేదని ప్రశ్నించారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలకు కేసీఆర్ రూ.20 కోట్లు కేటాయిస్తే కాంగ్రెస్ ఎందుకు రద్దు చేసిందని తెలిపారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా బడ్జెట్ విడుదల చేయలేదని పేర్కొన్నారు. రెండున్నర ఏండ్లలో దాదాపు రూ.ఎనిమిది కోట్ల బడ్జెట్ విడుదల చేయాల్సి ఉన్నా ఈ ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వలేదని తెలిపారు. విద్యార్థులు, పీఈటీ టీచర్లు ఆ ఖర్చును భరించారని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలతో నిర్వహించిన ఆటల పోటీలకు రూ.18 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం, విద్యార్థుల ఆటపాటల కోసం రూ.ఎనిమిది కోట్లు లేవా సీఎం రేవంత్‌రెడ్డి అని ప్రశ్నించారు. రూ.200 కోట్లు ఖర్చు పెట్టి, ఒక్క రోజు మెస్సీతో ఆడిస్తే క్రీడాకారులు కాలేరని తెలిపారు. మాటలు కాకుండా, చేతల్లో చిత్తశుద్ధి ఉండాలి ప్రభుత్వానికి సూచించారు.
మట్టిలో మాణిక్యాలను వెలికితీయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



