ఘనంగా జయంతి ఉత్సవాలు
నవతెలంగాణ – కంఠేశ్వర్
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి ఐలమ్మ ఆశయాల సాధనకు అంకిత భావంతో కృషి చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, అదనపు కలెక్టర్ అంకిత్ పిలుపునిచ్చారు. చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం వినాయక్ నగర్ లో గల విగ్రహానికి ఎమ్మెల్యే, అదనపు కలెక్టర్, ఇతర జిల్లా శాఖల అధికారులు, వివిద కుల సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో న్యూ అంబేద్కర్ భవన్ లో జ్యోతి ప్రజ్వలన చేసి ఐలమ్మ జయంతి వేడుక జరిపారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ఐలమ్మ పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేశారని గుర్తు చేశారు. హక్కుల కోసం రాజీలేని పోరాటం చేసి స్ఫూర్తిని నింపారని కొనియాడారు. చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకుని, ఆమె ఆశయాల సాధనకు కృషిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి నర్సయ్య, సహాయ అభివృద్ధి అధికారి గంగాధర్, రజక కులాల అధ్యక్ష, కార్యదర్శులు, ,ప్రతినిధులు, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఐలమ్మ ఆశయాల సాధనకు కృషి చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES