కుకీ-జో తిరుగుబాటు గ్రూపుల డిమాండ్
కుదరదన్న కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీ : కేంద్ర హౌం వ్యవహారాల మంత్రిత్వ శాఖతో తాము చర్చలు జరిపామని మణిపూర్‌లోని కుకీ-జో తిరుగుబాటు గ్రూపులు తెలిపాయి. తమకు శాసనసభతో కూడిన కేంద్ర పాలిత ప్రాంత(యూటీ) హౌదా ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. మణిపూర్ రాష్ట్ర వ్యవస్థలో తాము ఉండటం ఇక సాధ్యం కాదని స్పష్టం చేశాయి. అయితే కేంద్ర హౌంమంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ) ఈ డిమాండ్‌ను తిరస్కరించింది. ఈనెల 6,7 తేదీల్లో జరిగిన చర్చల్లో కుకీ నేషనల్ ఆర్గనైజేషన్ (కేఎన్‌ఓ), యునైటెడ్ పీపుల్స్ ఫ్రంట్ (యూపీఎఫ్) ప్రతినిధులు పాల్గొన్నారు. కేంద్రం తరఫున ఈశాన్య సలహాదారు ఎ.కె మిశ్రా హాజరయ్యారు.
కేంద్రం కుకీ-జో ప్రజల కష్టాలను అర్థం చేసుకుంటున్నప్పటికీ.. ప్రస్తుతం కొత్త యూటీలను సృష్టించే విధానం లేదని ఎంహెచ్‌ఏ వర్గాలు తెలిపాయి. మణిపూర్‌లోని అన్ని వర్గాలతో కలిసి రాజకీయ పరిష్కారం కోసం చర్చలు కొనసాగిస్తామని హామీ ఇచ్చింది. కాగా తిరుగుబాటు గ్రూపులు గిరిజన చీఫ్‌ల భూస్వామ్య హక్కులు, స్థానిక పరిపాలన రక్షణ, ఇంఫాల్‌లో పరిపాలనా ప్రక్రియల సరళతపై కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. సెప్టెంబర్4న సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్ (ఎస్‌ఓఓ) ఒప్పందం పునరుద్ధరించబడనప్పటికీ.. 2023 మణిపూర్ హింస తర్వాత కుకీ-జో గ్రూపులు తమ డిమాండ్లను ‘స్వయం పరిపాలన’ నుంచి యూటీ హౌదా వరకు పెంచడం గమనార్హం. అయితే కేంద్రం మాత్రం రాజ్యాంగ పరిధిలో పరిష్కారం సాధ్యమని చెప్తూ.. యూటీ హౌదాను తిరస్కరిస్తున్నది.
శాసనసభతో కూడిన యూటీ కావాలి
- Advertisement -
- Advertisement -



