Thursday, May 22, 2025
Homeసినిమాఇలాంటి సినిమాలు అవసరం

ఇలాంటి సినిమాలు అవసరం

- Advertisement -

రాజేంద్ర ప్రసాద్‌, అర్చన కాంబినేషన్‌లో రూపేష్‌, ఆకాంక్ష సింగ్‌ హీరో, హీరోయిన్లుగా పవన్‌ ప్రభ దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్‌ పతాకం పై రూపేష్‌ నిర్మించిన చిత్రం ‘షష్టిపూర్తి’. ఈ నెల 30న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్‌ చేసిన పాటలు, టీజర్‌, ట్రైలర్‌ అన్నీ కూడా ప్రేక్షకుల్లో అంచనాల్ని పెంచేశాయి.
‘మళ్లీ రావా’, ‘దేవదాస్‌’, ‘పరంపర’ ప్రాజెక్ట్‌లతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఆకాంక్ష సింగ్‌ ఇందులో కథానాయికగా నటించారు. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె బుధవారం మీడియాతో ముచ్చటించారు.
దర్శకుడు ఈ కథ చెప్పినప్పుడు ఇప్పుడు ఇలాంటి కథలు అవసరం అనే ఫీలింగ్‌తో నటించటానికి అంగీకరించాను. ఈ సినిమాలో జానకి అనే పాత్రలో కనిపిస్తాను. ఓ గ్రామీణ అమ్మాయి పాత్ర నాది. టెంపుల్‌ ట్రెజరర్‌గా నటించాను. అచ్చమైన తెలుగమ్మాయిగా ఈ చిత్రంలో కనిపిస్తాను. అయితే ఇందులో నేను కేవలం రెగ్యులర్‌ హీరోయిన్‌ పాత్రలో కనిపించను. నా క్యారెక్టర్‌లో ఎన్నో షేడ్స్‌ ఉంటాయి. అవన్నీ నేను ఇప్పుడే చెప్పలేను. వాటిని మీరు సినిమాలోనే చూడాలి.
ఈ చిత్రం అద్భుతంగా ఉంటుంది. టెక్నికల్‌గానూ హై స్టాండర్డ్స్‌లో ఉంటుంది. పాటలు, మ్యూజిక్‌ అందరినీ కదిలిస్తుంది. ప్రతీ పాటకు ఓ ఎమోషన్‌ ఉంటుంది. ఇళయరాజా పాటలు ఎప్పటికీ నిలిచిపోతాయి. ‘షష్టి పూర్తి’ అనేది కేవలం షష్టి పూర్తి గురించే ఉండదు. అన్ని రకాల అంశాలు ఉంటాయి.
‘బెంచ్‌ లైఫ్‌’లో నేను రాజేంద్ర ప్రసాద్‌తో నటించాను. మళ్లీ ఈ చిత్రంలో నటించాను. మా నిర్మాత రూపేష్‌ చాలా మంచి వ్యక్తి. సినిమాల పట్ల ఎంతో ప్యాషన్‌ ఉంది. నటుడిగానే కాకుండా నిర్మాతగానూ ఈ చిత్రానికి న్యాయం చేశారు. మా దర్శకుడు పవన్‌కు ఓ క్లారిటీ, విజన్‌ ఉంది. ఆయనతో పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది.
ఈ చిత్రాన్ని కుటుంబ సమేతంగా చూడాలి. తల్లిదండ్రుల గురించి గొప్పగా చెప్పే ఈ సినిమాను అందరూ తప్పకుండా చూసి సక్సెస్‌ చేయండి. ఈ మూవీ కోసం షూటింగ్‌ చేస్తున్నప్పుడు మా నాన్న గుర్తుకు వచ్చారు. నేను ఆయన్ను చాలా మిస్‌ అయ్యాను. తల్లిదండ్రులతో ఎక్కువ సమయాన్ని గడపండి.. వారిని ప్రేమించండి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -