Monday, February 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంజనం పిలిస్తే పలికే నాయకులు కావాలి

జనం పిలిస్తే పలికే నాయకులు కావాలి

- Advertisement -

నిజామాబాద్‌లో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌

నవతెలంగాణ-కంఠేశ్వర్‌
జనం పిలిస్తే పలికే నాయకులు కావాలని, నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ అభ్యర్థులను గెలిపించి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ తెలిపారు. ఆదివారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో కోటగల్లి కార్నర్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. నిత్యం ప్రజా క్షేత్రంలో ఉండే నాయకులను గెలిపించాలని సూచించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉచిత బస్సు మొదలుకొని సన్నబియ్యం వరకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. రూ. రెండువేల కోట్ల నిధులు ఇచ్చి మేటి నగరంగా మారుస్తానని సీఎం బహిరంగ సభలో హామీ ఇచ్చారని గుర్తుచేశారు.

బీజేపీ నేతలు దేవుడు పేరు చెప్పి రాజకీయాలు చేస్తున్నారని, బీజేపీ నేతల మాటలు చూస్తుంటే చిన్న పిల్లలు నవ్వుకునే పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు. పీసీసీ అధ్యక్షుడిని అయ్యాక మూడు నెలల్లో 35 ఏళ్ల ఇంజనీరింగ్‌ కళాశాల స్వప్నం నెరవేర్చానని, సీఎం చేతుల మీదుగా వ్యవసాయ కళాశాలకు శంకుస్థాపన చేయించామన్నారు. 26వ డివిజన్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి శివప్రసాద్‌ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు నగేష్‌రెడ్డి, ఉర్డూ అకాడమీ చైర్మెన్‌ తాహెర్‌బిన్‌ హందాన్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంభూపాల్‌, డాక్టర్‌ కవితారెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ నగర అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -