చెన్నూరు మహర్షి విద్యా మందిర్ లో విద్యార్థులకు అవగాహన
నవతెలంగాణ – పాలకుర్తి
బాల్యవివాహాలను నిర్మూలించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని స్కోప్ బాధ్యులు దూసరి తరుణ్ అన్నారు. గురువారం మండలంలోని చెన్నూరు ల గల మహర్షి విద్యా మందిర్ లో బాల్యవివాహాల నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పాఠశాల ప్రిన్సిపాల్ వెంకటాచారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బాల్యవివాహాలు, వచ్చే నష్టం పై విద్యార్థులకు వివరించారు. బాల్యవివాహాలు జరిగినట్లు తెలిస్తే చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ 1098, పోలీస్ హెల్ప్ లైన్ నంబర్ 100 సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు నరేందర్ రెడ్డి, గిరగాని సమ్మయ్య లతోపాటు స్కోప్ సంస్థ బాధ్యులు పాల్గొన్నారు.
బాల్య వివాహాలను నిర్మూలించడంలో భాగస్వాములు కావాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES