వార్డు మెంబర్లకు ఐదు రోజుల శిక్షణ..
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
గ్రామాల అభివృద్ధిలో సర్పంచులతోపాటు వార్డు సభ్యులు కూడా భాగస్వాములు కావాలని జిల్లా పంచాయతీ అధికారి షరీఫ్ ఉద్దీన్ అన్నారు. ఇటీవలే నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఐదు రోజుల శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిక్షణలో మండలంలోని అంకిరెడ్డి పల్లె, అంకుసాపూర్, బాలమల్లు పల్లె, చీర్లవంచ, చింతల్ టాన, చిన్న లింగాపూర్, దేశాయిపల్లి, గండి లచ్చపేట గ్రామాల్లోని 80 మంది వార్డు సభ్యులకు ఈ శిబిరాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పంచాయతీ అధికారి షరీఫుద్దీన్ వార్డు సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. ఎప్పటికప్పుడు గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించే విధంగా తమ వంతు సహకారాన్ని సర్పంచులకు అందించాలని సూచించారు. ఐదు రోజుల నిర్వహించే ఈ శిబిరాన్ని ప్రతి వార్డు సభ్యులు తప్పక హాజరు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ మీర్జా అఫ్జల్ అహ్మద్ బిగ్, సూపర్ ఇండెంట్ రమేష్, రాజనర్సు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.



