Wednesday, October 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పత్తి, వేరుశనగ రైతులను ఆదుకోవాలి

పత్తి, వేరుశనగ రైతులను ఆదుకోవాలి

- Advertisement -

– దెబ్బతిన్న పంటలకు ఎకరానికి రూ.25 వేలు నష్టపరిహారం ఇవ్వాలి..
– బీఆర్ఎస్ జిల్లా నాయకుడు, కుప్పగండ్ల మాజీ సర్పంచ్ మోక్తాల శేఖర్ ముదిరాజ్..
నవతెలంగాణ – వెల్దండ
భారీ వర్షాలతో అతలాకుతలమైన రైతాంగాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని టిఆర్ఎస్ జిల్లా నాయకుడు, కుప్పగండ్ల మాజీ సర్పంచ్ మోక్తాల శేఖర్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన వెల్దండ మండల కేంద్రంలో నీ టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పత్తి , వేరుశనగ పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వం వెంటనే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి గ్రామాల్లో రైతులు పండించిన పంటలు , నష్టపోయిన తీరును గుర్తించాలని సూచించారు.

నష్టపోయిన పత్తి వేరుశనగ, పంటలను అంచనావేసి రైతులకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఇప్పటికే రైతుబంధు రకా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు వర్షాలతో   ములీగే నక్క పై తాటికాయ పడ్డట్లు అన్న చందంగా అయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భారీ వర్షాలతో పత్తి , వేరుశనగ  పంటలు దెబ్బతిని తీవ్రంగా స్థాయిలో నష్టపోయారని , ఆ రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని ఆయన అన్నారు. పంటలు దెబ్బతిన్న రైతులకు ఎకరానికి రూ. 25 వేలు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు..అదేవిధంగా భారీ వర్షాల కారణంగా గ్రామాల్లో చాలా చెట్లు విరిగిపడ్డాయని రోడ్లు ,వంతెనలు తెగిపోయాయని వాటి మరమ్మతులు వెంటనే చేపట్టాలని మోక్తాల శేఖర్ డిమాండ్ చేశారు.. ఈ  సమావేశంలో  టిఆర్ఎస్ నాయకులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -