Wednesday, July 9, 2025
E-PAPER
Homeజిల్లాలుస్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి

- Advertisement -

నవతెలంగాణ -భిక్కనూర్
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని మండల కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు శ్రీరామ్ వెంకటేష్ తెలిపారు. బుధవారం పట్టణ కేంద్రంలో గ్రామస్థాయి యువజన కాంగ్రెస్ నాయకులతో ఏర్పాటు చేసిన అసెంబ్లీ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో పార్టీ ఇంచార్జ్ సాయిబాబా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామస్థాయి యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలకు అందుబాటులో ఉండి పార్టీని బలోపేతం చేయాలని, సోషల్ మీడియా వినియోగం, ఎన్నికల అంశాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థాయి యువజన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -