నవతెలంగాణ – తంగళ్ళపల్లి
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. తంగళ్ళపల్లి మండలంలోని ఇందిరమ్మ కాలనీ, నరసింహుల పల్లె, అంకుసాపూర్, దేశాయిపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి సమావేశాన్ని మంగళవారం నాయకులు నిర్వహించారు.. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటు వంటి సంక్షేమ పథకాలను ప్రజలకు ఒక్కొక్కటిగా వివరిస్తూ ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం, రేషన్ కార్డు, ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, రైతు రుణమాఫీ, మహిళలకు పావలా వడ్డీ, రూ.10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ తో పాటు 18 నెలలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి తెలియజేస్తూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కంకణబద్ధులై పల్లెల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి లింగాల భూపతి, జిల్లా కార్యదర్శి సత్తు శ్రీనివాస్ రెడ్డి, మునిగేల రాజు,మానవ హక్కుల యువజన విభాగం జిల్లా అధ్యక్షులు గుగ్గిళ్ళ భరత్ గౌడ్, సోషల్ మీడియా ఇంచార్జ్ గడ్డం మధుకర్, జిల్లా సీనియర్ నాయకులు అసరి బాలరాజు, మచ్చ శ్రీనివాస్, ఎగుర్ల ప్రశాంత్,మల్లేశం యాదవ్, ఎడ్ల తిరుపతి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల్లో సత్తా చాటాలి…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES