దుగ్గి చిరంజీవి.. సీపీఐ(ఎం) మండల కార్యదర్శి
నవతెలంగాణ – గోవిందరావుపేట
మండలం లోని కాటాపూర్ గ్రామంలో ఈ మధ్యకాలంలో పడుతున్న భారీ వర్షాల కారణంగా ఇంటి గోడ కూలిపోయిన ఆళ్ల రవి కుటుంబాన్ని ప్రభుత్వ మాదుకోవాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దుద్ది చిరంజీవి ప్రభుత్వాన్ని కోరారు. గురువారం మండల కార్యదర్శి దుగ్గి చిరంజీవి గ్రామ అధ్యక్షులు సత్యనారాయణ లు వెళ్లి రవి ఇంటిని పరిశీలించారు ఆ కుటుంబాన్ని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. గత సంవత్సరంలో కూడా వర్షాల కారణంగా గోడ కూలిపోవడం జరిగింది. అతనికి ఇద్దరు ఆడపిల్లలు ఒక కుమారుడు ఉన్నారు.
గత సర్వే అప్పుడు సర్వే జరిగిన కూడా గడ్డి గుడిసె అయినప్పటికీ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయలేదు. వర్షాలు పడుతున్నప్పుడు ఆ ఇంట్లో ఏ సమయంలో ఎప్పుడు ఏ గోడ కూలుతుందో అన్న భయంతో బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేత పెట్టుకొని జీవనం కొనసాగిస్తున్నారు. కాబట్టి పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీవో లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ పేద కుటుంబాన్ని ఆదుకోవాలని అదేవిధంగా గోడ కూలిపోయిన దానికి పరిహారం చెల్లించాలని, ఈ మధ్యకాలంలో కూడా సర్వే చేసుకోపోయినారు. కాబట్టి కచ్చితంగా సెకండ్ లిస్టులో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ఈ ప్రభుత్వాన్ని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దుగ్గి చిరంజీవి, అదేవిధంగా గ్రామ అధ్యక్షులు ఎర్రోజు సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇంటి గోడ కూలిపోయిన కుటుంబాన్ని ఆదుకోవాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES