నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
వన మహోత్సవంలో భాగంగా గురువారం రోజు మాస్ ప్లాంటేషన్ కార్యక్రమం యాదాద్రి భువనగిరి జిల్లాలో విజయవంతంగా ఒక్క రోజులోనే 2 లక్షల వివిధ రకాల మొక్కలు నాటడం జరిగిందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. ఈ సంవత్సరం యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తం 20 లక్షల మొక్కలు నాటే లక్ష్యాన్ని పెట్టుకోగా, నిన్నటి వరకు 14 లక్షల మొక్కలు నాటడం జరగగా, గురువారం రోజున, 17 మండలాలలో, ఆరు మున్సిపాలిటీలలోపరిధిలో లోని ప్రతి గ్రామపంచాయతీ , మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి వార్డులో కలుపుకొని జిల్లా వ్యాప్తంగా మొత్తం 2.లక్షల మొక్కలు నాటడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఒక్కరోజులో రెండు లక్షల మొక్కలు నాటాం: కలెక్టర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES