Sunday, July 6, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంసానుకూల స్ఫూర్తితోనే స్పందించాం

సానుకూల స్ఫూర్తితోనే స్పందించాం

- Advertisement -

– కాల్పుల విరమణ ప్రతిపాదనపై హమాస్‌
కైరో : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మధ్యవర్తిత్వంతో ముందుకొచ్చిన కాల్పుల విరమణ ప్రతిపాదనపై ‘సానుకూల స్ఫూర్తి’ తోనే స్పందించామని హమాస్‌ తెలిపింది. ఒప్పందం అమలుపై చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పింది. ఇజ్రాయిల్‌, హమాస్‌ మధ్య సుమారు 21 నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి తాత్కాలికంగా స్వస్తి చెప్పి, 60 రోజుల పాటు కాల్పుల విరమణ పాటించేందుకు ఉద్దేశించిన ‘తుది ప్రతిపాదన’ను ట్రంప్‌ ప్రకటించారు. ఇరు పక్షాల నుండి సమాధానాన్ని ఆశిస్తున్నానని ఆయన అన్నారు. దీనిపై హమాస్‌ తన అధికారిక వెబ్‌సైట్‌లో స్పందించింది. ‘ఆంతరం గిక సంప్రదింపులను పూర్తి చేశాం. గాజాలో మన ప్రజలపై ప్రదర్శిస్తున్న దాష్టీకానికి స్వస్తి పలికేందుకు మధ్య వర్తులు అందించిన తాజా ప్రతి పాదనపై పాలస్తీనా వర్గాలు, శక్తుల తోనూ చర్చించాం. మధ్యవర్తిత్వం నెరపుతున్న సోదరులకు హమాస్‌ తన స్పందన తెలియజేసింది. సాను కూల స్ఫూర్తితో స్పందించాం. ఒప్పం దాన్ని ఎలా అమలు చేయా లన్న విషయంపై చర్చించేందుకు మేము పూర్తి సిద్ధంగా ఉన్నాం’ అని హమాస్‌ ఓ ప్రకటనలో వివరించింది.
అయితే ఒప్పందం కుదుర్చుకో వడం సవాళ్లతో కూడిన పనేనని పాలస్తీనా మిలిటెంట్‌ గ్రూప్‌కు చెందిన అధికారి ఒకరు చెప్పారు. మానవతా సాయం, రఫా మీదుగా ఈజిప్టులో ప్రవేశం, ఇజ్రాయిల్‌ దళా ల ఉపసంహరణకు కాలపరిమితి వంటి అంశాలపై స్పష్టత రావాల్సి ఉన్నదని ఆయన తెలిపారు. కాగా 60 రోజుల కాల్పుల విరమణను ఖరారు చేయడానికి ‘అవసరమైన షరతుల’కు ఇజ్రాయిల్‌ అంగీకరిం చిందని ట్రంప్‌ ఇప్పటికే తెలియ జేశారు. అయితే ట్రంప్‌ ప్రకటనపై ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహూ ఇంకా స్పందించలేదు. కాల్పుల విరమణ ప్రతిపాదన తమ కు అందిందని, తాము హమాస్‌ స్పందన కోసం ఎదురు చూస్తున్నా మని ఇజ్రాయిల్‌ అధికారి ఒకరు అన్నారు. కాగా హమాస్‌ స్పందనను తాము చూశామని, అయితే ఆ సంస్థ చేసిన కొన్ని డిమాండ్లను పరిశీలిం చాల్సి ఉన్నదని ఈజిప్ట్‌ భద్రతాధికారి చెప్పారు. కాల్పుల విరమణ ప్రయ త్నాలకు ఈజిప్ట్‌, ఖతార్‌ మధ్యవర్తి త్వం వహిస్తున్న విషయం తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -