Friday, November 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సైన్స్ అభివృద్ధి కోసం మనమందరం కృషి చేయాలే..

సైన్స్ అభివృద్ధి కోసం మనమందరం కృషి చేయాలే..

- Advertisement -

నవతెలంగాణ – చిన్నకోడూరు
సమాజంలో మూఢనమ్మకాలకు తావివ్వకుండా సైన్స్ అభివృద్ధి కోసం మనమందరం కృషి చేయాలని మండల విద్యాధికారి తిరుపతి అన్నారు. శుక్రవారం చిన్నకోడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి చెకుముఖి టాలెంట్ టెస్ట్  నిర్వహించడం జరిగింది. పెద్ద కోడూరు కేజీబీవీ, అల్లిపూర్ పాఠశాల విద్యార్థులకు ప్రథమ స్థానాన్ని పొందారు. ఆ విద్యార్థులకు ఎంఈఓ తిరుపతి చేతుల మీదుగా ప్రశంస పత్రాలను  అందజేశారు. ఈ కార్యక్రమంలో  సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్ముగల్ల  కనకరాజు,  పాఠశాల ఇంఛార్జి ప్రధానోపాధ్యాయులు వేంకటేశం,కృష్ణమూర్తి,రవీందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి, మండలంలోని ఆయా పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -