నవతెలంగాణ – కాటారం : మండల కేంద్రం లో సోమవారం రోజున ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కాంగ్రెస్ యువ నాయకులు బొడ్డు శేఖర్ మాట్లాడుతూ… మంథని నియోజకవర్గంలో గత 10 సం.రాల కాలంలో పుట్ట మధు వెంకటాపూర్ వేదికగా జరిపించిన ఇసుక అక్రమ రవాణా,ఇసుక అక్రమ రవాణాతో కట్టుకున్న రాజాగృహాల సంగతి ప్రజలకు బాగా తెలుసన్నారు.అక్రమ ఇసుక ట్రాక్టర్ లలో తరలిస్తున్న వాటిని పోలీసులు వాళ్ళ డ్యూటీలలో భాగంగా పట్టుకుంటే దాన్ని మంత్రి శ్రీధర్ బాబు కు అంటగట్టడం మీ అవివేకం అని అన్నారు.10 సం.రాలలో జరిగిన ఇసుక అక్రమ రవాణా లారీల క్రింద నలిగిన ప్రాణాలకు బాధ్యులు మీ నాయకుకూడేనని అన్నారు. మంథని నియోజకవర్గం ప్రజలు మేల్కొన్నారు. బుద్ధి చెప్పారు..అయినా కాని బీ ఆర్ ఎస్ నాయకుల కు బుద్ధి రావట్లేదు అని అన్నారు. ఇసుక మాఫియాను ప్రోత్సహించింది మొట్టమొదటిగా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అని గతం తెలుసుకొని బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేయాలని ఈ సందర్భంగా బొడ్డు శేఖర్ హేచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యువనాయకులు సుందిళ్ళ ప్రభు దాస్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు
మతిభ్రమించి చేస్తున్న అవాస్తవ ఆరోపణలు మానుకోవాలి…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES