- Advertisement -
నవతెలంగాణ – దుబ్బాక
శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరు సహకరించాలని సీఐ పాలెపు శ్రీనివాస్ అన్నారు. వినాయక నవరాత్రి, నిమజ్జన ఉత్సవాల్ని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. శుక్రవారం దుబ్బాక లోని సీఐ కార్యాలయంలో వినాయక మండప నిర్వాహకులతో ఏర్పాటు చేసిన పీస్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఎస్ఐ కే.కీర్తి రాజు, గణేష్ మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.
- Advertisement -