Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంరోడ్డు విస్తరణ పనులకు సహకరించాలి - కమీషనర్ సుజాత

రోడ్డు విస్తరణ పనులకు సహకరించాలి – కమీషనర్ సుజాత

- Advertisement -

– ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తే చట్టపరమైన చర్యలు – సీఐ నాగరాజు
నవతెలంగాణ – అశ్వారావుపేట : మున్సిపల్ పరిధిలోని ప్రధాన వీదుల్లో జరుగుతున్న రోడ్డు విస్తరణ,సెంట్రల్ లైటింగ్ పనులకు వ్యాపారులు సహకరించాలని మున్సిపల్  కమీషనర్ కే.సుజాత సూచించారు. అలాగా ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా వ్యాపారులు రహదారికి ఇరువైపులా ఖాలీ ఉంచాలని సీఐ నాగరాజు హెచ్చరించారు. గురువారం వీరు ఇరువురు కలసి రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు.  ఈ సందర్భంగా సమస్యాత్మకంగా ఉన్న రింగ్ సెంటర్లో ని ఫారెస్ట్ చెక్క పోస్టు కార్యాలయ పసరిరాలను పరిశీలించారు. సీపీఐ కార్యాలయం తో పాటు పలు దుకాణాలు విస్తరణ పనులకు అడ్డుగా ఉండటంతో ఆర్ అండ్ బి అధికారులు కమీషనర్ పిర్యాదు చేయడంతో క్షేత్రస్థాయిలో పరిశీలించి వ్యాపారులకు సూచనలు చేశారు. తప్పనిసరిగా అభివృద్ధికి సహకరించాలని ఎటువంటి ఆదారాలు ఉన్నా సమర్చించాలని అవాంతరాలు సృష్టించవద్దని పనులు ఆగకుండా సాగేందుకు తదుపరి ప్రత్యామ్నాయ మార్గం చూస్తామన్నారు.అంతే కాకుండా పట్టణ వ్యాపారులు, చిరు వ్యాపారులు సైతం ప్రధాన డ్రైన్ వెలుపల తమ వ్యాపార కార్యకలాపాలు చూసుకోవాలని అందుకు పోలీసుల సహకారం అందించాలని సీఐ కి తెలిపారు.కమీషనర్ తో పాటు ఆర్ అండ్ బి అధికారులు, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad