- Advertisement -
నవతెలంగాణ జన్నారం
జన్నారంలో పూసల సంఘ భవన నిర్మాణానికి ప్రభుత్వం, దాతలు కృషి చేయాలని ఆ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు కొమురయ్య, మండల అధ్యక్షుడు పుసవేర్ల రాజన్న కోరారు. సోమవారం మండల కేంద్రంలోని రామాలయ కాలనీలో పూసల సంఘం మండల స్థాయి సమావేశం నిర్వహించారు. సంఘ బలోపేతానికి ప్రతి ఒక్కరూ ఐక్యతతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన పూసల కులస్థుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో పూసల సంఘం నాయకులు తిరుపతి శ్రీకర్ స్వామి రాజు రమేష్ తిరుపతి రవి, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



