జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
ప్రభుత్వ రెసిడెన్సియల్ ,కేజీబివి పాఠశాల కళాశాలలో చదివే ప్రతి విద్యార్థికి పదవ తరగతి, ఇంటర్ లలో 70 శాతానికి పైగా ప్రతి సబ్జెక్టు లో మార్కులు సాధించేలా సిబ్బంది ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లోని కలెక్టర్ వి సి హాల్ లో మంగళవారం సంక్షేమ అధికారులు,విద్యా శాఖ, కేజీబివి ప్రత్యేక అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు.
రెసిడెన్సియల్ , కేజీబివి పాఠశాల కళాశాలలో ఇక నుండి ఆకస్మిక తనిఖీ చేపట్టినపుడు ఎవరైనా విధుల్లో లేకపోతే చర్యలు తీసుకోవటం జరుగుతుందని,సిబ్బంది సమయ పాలన పాటించాలని ,సిబ్బంది హాజరు వివరాలు,విద్యార్థుల హాజరు వివరాలు ప్రతి రోజు నివేదిక ఇవ్వాలని సూచించారు.అధికారులు పాఠశాలలకు వచ్చే గ్రుడ్లు, పాలు, చికెన్, వంట సామాగ్రి సమయానికి చేరిందా లేదా తెలుసుకోవాలని, భోజనం ఎలా ఉంటుందో పరిశీలించాలని,అలాగే కాంట్రాక్టర్ నాణ్యత పాటించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.ప్రతి విద్యార్థి కి ఆర్ బి ఎస్ కే వైద్యులచే ఆరోగ్య పరీక్షలు నిర్వహించి హెల్త్ ప్రొఫైల్ కార్డు తయారు చేసేలా చూడాలని స్పష్టం చేశారు.
కేజీబివి లలో ఎక్కడైనా అవసరం ఉంటే త్రాగునీరు, టాయిలెట్స్, ట్యాప్స్,సీలింగ్ ప్యాన్స్,లైట్స్ లాంటి వాటికి మరమ్మత్తులు చేపట్టాలని తెలిపారు.విద్యార్థులకి మెరుగైన సౌకర్యాలు కల్పించి, ఆరోగ్యం బాగుండేలా చూసి,నాణ్యమైన భోజనం అందించి , వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి మంచి ఫలితాలు సాధించేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు.ఈ కార్ఎయక్రమంలో స్ టి ఎస్ సి, బి సి, మైనార్టీ సంక్షేమ అధికారులు శంకర్, దయానంద రాణి, నరసింహారావు, శ్రీనివాస్ నాయక్,,డి డబ్ల్యూ ఓ నరసింహారావు,డి ఈ ఓ అశోక్, జి సి డి ఓ పూలన్,టి జీ ఈ డబ్ల్యూ ఐ సి డి ఈ రమేష్,డి సి ఓ లు,కేజీబివి ప్రత్యేక అధికారులు, తదితరులు పాల్గొన్నారు.