నవతెలంగాణ తంగళ్ళపల్లి
తెలంగాణ రైతాంగ సాయుద పోరాట వీరనారి చిట్యాల ఐలమ్మ మన అందరికి స్ఫూర్తి అని సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు కోడం రమణ అన్నారు. బుధవారం ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని ఐలమ్మ విగ్రహానికి సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… భూమికోసం, భుక్తికోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం నైజాం నిరంకుశ పాలనలో దొరలు, భూస్వాములు, రజాకార్లకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో మట్టి మనుషులు చేసినటువంటి మహత్తర పోరాటంలో తెలంగాణ వీరనారి ఐలమ్మ కీలకపాత్ర పోషించిందన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో నాయకులు ఐలమ్మ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రమేష్ చంద్ర, కుడిక్యాల కనకయ్య, కోడం వేణు, మర్కటి నరసయ్య, మూషం శంకర్, అక్కల శ్రీనివాస్, హరిదాసు, రాంనారాయణ, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు తంగళ్ళపల్లి మాజీ ఉపసర్పంచ్ పెద్దూరి తిరుపతి, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి లింగాల భూపతి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బాలు, కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు ప్రశాంత్, సుద్దాల శ్రీనివాస్ గౌడ్, ఎండి హమీద్, కిషన్, పరశురాములు పాల్గొన్నారు.