Wednesday, October 1, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసీజనల్‌ వ్యాధుల కేసుల్లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలి : మంత్రి దామోదర

సీజనల్‌ వ్యాధుల కేసుల్లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలి : మంత్రి దామోదర

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సీజనల్‌ వ్యాధుల కేసుల్లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌ కార్యాలయంలో సీజనల్‌ వ్యాధుల నివారణపై ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సీజనల్‌ వ్యాధుల నివారణపై ఏర్పాటు చేసిన పవర్‌ పాయింట్‌ ప్రదర్శనను మంత్రి పరిశీలించారు. అనంతరం సీజనల్‌ వ్యాధుల పూర్తి నియంత్రణకు ఈ ఏడాది తీసుకున్న చర్యలను అధికారులు మంత్రికి వివరించారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది సీజనల్‌ వ్యాధుల కేసులు తగ్గుముఖం పట్టాయని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ రవీందర్‌ కుమార్‌ తెలిపారు.

రాష్ట్రంలో ప్రజారోగ్య శాఖ సీజనల్‌ వ్యాధుల నిర్మూలనలో ముందస్తు నివారణ చర్యలు చేపట్టడం వల్లే కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయని అధికారులు మంత్రికి వివరించారు. మంత్రి ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రజల్లో అవగాహనను కల్పించినట్టు చెప్పారు. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో సీజనల్‌ రోగాలకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచినట్టు వారు తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో వైద్యారోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్‌ క్రిస్టినా జడ్‌ చోంగ్తూ, ఆరోగ్య శ్రీ ట్రస్ట్‌ సిఇవో ఉదయ్ కుమార్‌, రాష్ట్ర వైద్యవిద్య సంచాలకులు డాక్టర్‌ నరేంద్ర కుమార్‌, తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ అజయ్ కుమార్‌, స్పెషల్‌ ఆఫీసర్‌ విమలా థామస్‌ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -