Tuesday, July 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కామ్రేడ్ సునీల్ ఆశయ సాధన కోసం ఉద్యమించాలి: ఎండీ జబ్బార్

కామ్రేడ్ సునీల్ ఆశయ సాధన కోసం ఉద్యమించాలి: ఎండీ జబ్బార్

- Advertisement -

సునీల్ జ్ఞాపకార్థం ప్రభుత్వ ఆస్పత్రిలో బ్రెడ్, పండ్లు పంపిణీ
నవతెలంగాణ – వనపర్తి: కామ్రేడ్ సునీల్ ఆశయ సాధన కోసం ఉద్యమించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎండి జబ్బార్ అన్నారు. సీపీఐ(ఎం) గోపాల్ పేట గ్రామ కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ సునీల్ 14 వ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలో సునీల్ స్తూపం దగ్గర వారి చిత్రపటానికి పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జబ్బర్, డి బాల్ రెడ్డి, పార్టీ జిల్లా నాయకులు అడ్వకేట్ ఆంజనేయులు పూలదండ వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జబ్బార్ మాట్లాడుతూ.. కామ్రేడ్ సునీలు విద్యార్థి దశ నుంచే అభ్యుదయవాదం వైపు ఆలోచించడం, ఈ సమాజంలో కులం పేరుతో జరుగుతున్న వివక్షతకు వ్యతిరేకంగా సామాజిక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనేవాడన్నారు.

రెండు గ్లాసుల పద్ధతికి వ్యతిరేకంగా, దేవాలయ ప్రవేశాలు ఎన్నో ప్రతిఘటన ఉద్యమాల్లో నాయకత్వం వహించి నడిపినవాడు కామ్రేడ్స్ సునీల్. ఈ సమాజం మారాలంటే సోషలిజం, కమ్యూనిజమే సరైన మార్గమని నమ్మి, తన చివరి శ్వాస ఉన్నంతవరకు సీపీఐ(ఎం) క్రమశిక్షణ గల కార్యకర్తగా, నాయకునిగా పని చేశారన్నారు. వారి ఆశయ సాధన కోసం ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా నాయకులు అడ్వకేట్ ఆంజనేయులు మాట్లాడుతూ.. కామ్రేడ్ సునీల్ గోపాల్ పేట గ్రామంలో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసేవాడన్నారు. సామాజిక, ఆర్థిక పోరాటాల్లో ఉమ్మడి గోపాల్ పేట మండలంలో చురుకుగా నిర్వహించిన వ్యక్తి కామ్రేడ్ సునీల్ అని అన్నారు.

సునీల్ లేని లోటు మరువలేమని వారన్నారు. వర్ధంతి సభ అనంతరం ప్రభుత్వం ఆస్పత్రిలో పేషెంట్స్ కి కామ్రేడ్స్ సునీల్ జ్ఞాపకార్థం బ్రెడ్, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం సునీల్ జ్ఞాపకార్థం ప్రభుత్వ ఆస్పత్రిలో బ్రెడ్, పండ్లు పంపిణీ చేశారు. డాక్టర్, నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ వర్ధంతి సభలో సామాజిక నాయకులు గంధం నాగరాజు, పార్టీ నాయకులు మహేష్, రాజు, అంజన్న, సుధాకర్, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు శరత్ బాబు, బాలస్వామి, సునీల్ తల్లిదండ్రులు రాజన్న, ప్రేమలీల, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -