Thursday, August 28, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్విద్యుత్ పోరాట అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమించాలి...

విద్యుత్ పోరాట అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమించాలి…

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
విద్యుత్ పోరాట అమరవీరుల స్ఫూర్తితో  ఉద్యమించాలని,  ప్రజలకు ఉచితంగా  ఇస్తున్న విద్యుత్ బషీర్ బాగ్ విద్యుత్ పోరాట అమరుల ప్రాణత్యాగం ఫలితమే, విద్యుత్ పోరాట అమరవీరుల 25వ వర్ధంతి సభలో సీపీఎం  డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్  అన్నారు.  విద్యుత్ పోరాట అమరవీరుల స్ఫూర్తితో పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ(ఎం) డివిజన్ కార్యదర్శితో , సీపీఎం పట్టణ కార్యదర్శి కుతాడి ఎల్లయ్యలు గురువారం మాట్లాడుతూ.. పట్టణ కేంద్రము సీపీఎం కార్యాలయం విద్యుత్ అమరవీరులకు పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ 2000 సం”లో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో బషీర్బాగ్ విద్యుత్ పోరాట అమరవీరుల 25వ వర్ధంతి ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ పోరాట మృతవీరులు విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి, రామకృష్ణ ల చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  2000 సంవత్సరం ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలోతెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అవలంబించిన ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తూ విద్యుత్ రంగాన్ని ప్రపంచ బ్యాంకు షరతుల్లో భాగంగా విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తూ రైతాంగం పై, ప్రజలపై మోపుతున్న విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉతృతమైన ఉద్యమాలు జరిగాయన్నారు.

ప్రైవేటీకరణ ఆపివేయాలని, ప్రజలపై విద్యుత్ బారాలు వద్దే వద్దు అంటూ  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో ప్రజాగ్రహాన్ని చవిచూసిన ఉద్యమం విద్యుత్ పోరాటం అన్నారు. దాదాపు రాష్ట్రవ్యాప్తంగా 100 రోజులపాటు ఈ విద్యుత్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం 9 వామపక్ష,కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో  జరిగిందని అన్నారు. ప్రతి గడపకు ఈ ఉద్యమం వెళ్లిందని విద్యుత్ ప్రవేతీకరణ జరిగితే పేదలకు, రైతాంగానికి తీవ్రమైన నష్టమని గ్రహించిన ప్రజలందరూ పల్లె పల్లె నుండి ఈ ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యారని ఈ సందర్భంగా నిర్వహించిన చలో హైదరాబాద్ కార్యక్రమంలో వేలాదిమంది ప్రజలు పాల్గొన్నారని అన్నారు.  పాలక ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పి ఆగస్టు 28 న బషీర్బాగ్ వద్ద ముగ్గురు అమరులను కాల్చి చంపిందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున బంద్ కు పిలిపిస్తే ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని బంద్ ను జయప్రదం చేయడం జరిగిందన్నారు. అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు తెలుగుదేశం ప్రభుత్వాన్ని నామరూపాలు లేకుండా ఓడించారన్నారు.

ముగ్గురు అమరవీరుల బలిదానంతో నేటికీ పాలక ప్రభుత్వాలు విద్యుత్ చార్జీలు పెంచకుండా ప్రజలందరికీ ఉచిత విద్యుత్తు అందిస్తున్నారని దీనికి కారణం విద్యుత్ పోరాట అమరుల ప్రాణ త్యాగ ఫలితమేనని అన్నారు. సమస్యలతో సతమవుతున్న ప్రజలు కదిలితే ఉద్యమం ఎలా ఉవ్వెత్తున ఎగిసిపడుతుందో చరిత్రలో నిలిచిన ఉద్యమన్నారు. కేంద్ర ప్రభుత్వం మతోన్మాద, కార్పోరేట్ విధానాలను కొనసాగిస్తుందని, రాబోయే కాలంలో సరళీకరణ,ఆర్థిక, మతోన్మాద,కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ పెద్ద ఎత్తున ఉద్యమాలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.  తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో గ్రామాలలో అనేక రకాల సమస్యలు పేరుకుపోయాయని స్థానిక సమస్యలు పరిష్కరించాలని రాష్ట్రవ్యాప్తంగా బలమైన ఉద్యమాలు నిర్మిస్తున్నామని అన్నారు.ప్రజలందరూ ఈ స్థానిక సమస్యల పరిష్కారం కోసం ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు కుల్డిప్ శర్మ, లల్యనాయక్, భుమేశ్, అంబులెన్స్ రాజు, నవీద్  అమిర్ఖన్ శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad