Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుకాళోజి స్ఫూర్తితో ముందుకు సాగాలి: ప్రొఫెసర్ బంగ్లా భారతి

కాళోజి స్ఫూర్తితో ముందుకు సాగాలి: ప్రొఫెసర్ బంగ్లా భారతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: కాళోజి నారాయణరావు జ‌యంతిని సీతాఫ‌ల్ మండి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బంగ్లా భారతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉన్నత సమాజ నిర్మాణం కోసం కాళోజీని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాల‌ని ఆశాభావం వ్య‌క్తంచేశారు. తెలంగాణ భాషా దినోత్సవంగా కాళోజీ జయంతిని నిర్వ‌హించుకోవ‌డం సంతోషంగా ఉంద‌న్నారు.

కళాశాల తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ కేతావత్ సైదులు మాట్లాడుతూ కాళోజి ప్రజాకవి అని ఆయన లోని సంఘర్షణలను నా గొడవగా చిత్రించి బతుకంత సమాజం కోసం పరితపించిన గొప్ప వ్యక్తి కాళోజి అని కొనియాడారు. అలాగే కళాశాల వైస్ ప్రిన్సిపాల్ కృష్ణమూర్తి, అధ్యాపకులు శివ నారాయణ, వెంకటేశం, జైపాల్, రాజు, సుధా,సరోజ, రజిని, సమత వాణి, విమలాదేవి,రాఘవేంద్ర గార్లు పాల్గొని కాళోజీ కృషిని కొనియాడారు.

కార్యక్రమాన్ని ఉద్దేశించి గెస్ట్ ఫ్యాకల్టీ శిర్గమల్ల కిషోర్, యడవెల్లి సైదులు కాళోజి లోని ఉద్యమ చైతన్యాన్ని ప్రస్తావించారు. ఎంతో ఉద్విగ్నంగా జరిగిన తెలంగాణ భాష దినోత్సవ సభలో ఇతర గెస్ట్ ఫ్యాకల్టీస్ కృష్ణవేణి,ఐమన్, సప్న ప్రత్యూష ఇర్ఫానా, చందన సాయి బృందం కళాశాల సహాయక సిబ్బంది పాల్గొని విజయవంతం చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad