- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచాలని జన్నారం మండలంలోని చింతగూడ సర్పంచ్ సుతారి సుమలత వినయ్ సూచించారు. హరిత సేన గ్రామ ఇన్ఛార్జ్ పోడేటి నరేశ్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం చింతగూడా గ్రామపంచాయతీ ఆవరణలో ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి ఆమె మొక్కలు నాటారు. ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడుకుందాం అని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కావ్య అనిల్, మాజీ వైస్ ఎంపీపీ వినయ్, మేకల అక్షయ్ కుమార్ నాయకులు ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



